హాయ్ ఫ్రెండ్స్ ఇన్సురెన్స్ పాలసీల సమాచార, బ్లాగ్ కి మీకు స్వాగతం.ఈ రోజు మనం ఎల్ఐసి వారి జీవన్ తరుణ్ పాలసీ గురించి తెలుసుకుందాం.
అసలు ఏంటి ఈపాలసీ ?
ఈ పాలసీ పేరు జీవన్ తరుణ్,ఈ ప్రపంచం భవిష్యత్తు ఈనాటి పిల్లల యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. కానీ వారు ఆ లక్ష్యం కోసం సిద్ధంగా లేకపోతే,ఆస్వప్నం దూరమైపోతుంది.అందుకోసమే ఎల్ఐసీ వారి జీవన్ తరుణ్ పాలసీ ప్రత్యేకంగా ఎదిగే పిల్లల కోసం ప్రవేశపెట్టడం జరిగినది.ఈ పథకాన్ని తల్లిదండ్రులు అలాగే బామ్మ,తాతయ్యలు తమ ప్రియమైన పిల్లల కోసంతీసుకోవచ్చు.
పాలసీ తీసుకోవడానికి అర్హతలు
0 సంవత్సరాల నుండి 12 లోపు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు,కనీస పాలసీ 1,00,000 నుండి గరిష్టంగా ఎంత పాలసీ అయిన ఇస్తారు.కాలపరిమితి 25 సంవత్సరాలు ప్రీమియం కట్టేది 20 నుండి ప్రవేశ వయస్సు తగ్గించాలి. ప్రీమియం కట్టడానికి సంవత్సరానికి,ఆరు నెలలు ,ముడు నెలలు,నెలవారీ చొప్పున కట్టవచ్చు.
పాలసీ తీసుకున్న వ్యక్తీ చనిపోతే
పాలసీ కాలపరిమితిలో పాలసీ అమలులో ఉండి పాలసిదారుడు చనిపోతే,నామినిగా ఎవరయితే ఉన్నారో వాళ్ళకి పాలసీ అమౌంట్ ఇస్తారు. ఇక్కడ సమ్ అస్సుర్డ్ డెత్ మరియు బోనస్ ఇస్తారు.ఇక్కడ సమ్ అస్సుర్డ్ డెత్ అంటే మీరు ఎంత పాలసీ తీసుకున్నారో దానికి 125 శాతం గాని లేకపోతే మీ సంవత్సరం ప్రీమియంకి 10రెట్లు గాని లేకపోతే చెల్లించిన ప్రీమియం 105 శాతం గాని ఈ మూడింటిలో ఏది ఎక్కువ అయితే అది నామినికి ఇవ్వడం జరుగుతుంది.
పాలసీ తీసుకున్న వ్యక్తీ బ్రతికి ఉంటే
పాలసీ కాల పరిమితి చివరి వరకు పాలసీదారుడు జీవించి ఉంటే అతనికి మేచ్యురిటి అమౌంట్ ని చెల్లించడం జరుగుతుంది.మధ్యలో మీకు ప్రీమియం చెల్లించడం పూర్తి అయిన తరువాత మీరు తీసుకున్న ఆప్షన్ ఆదారంగా మనీ బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ పాలసీలో మీకు సమ్ అస్సుర్డ్ తో పాటు బోనస్ మరియు ఫైనల్ అడిషనల్ బోనస్ రావడం జరుగుతుంది .
ఉదాహరణ
రాజు అనే ఒక బాబు వయస్సు 10 సంవత్సరాలు,అతను 25 సంవత్సరల కాలపరిమితితో ఒక 10 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే, ఏడాదికి ప్రీమియం 87,503 తో పాటు GST కలిపి ప్రీమియం గా చెల్లించాలి .
ఒక వేళ రాజు గారు కాల పరిమితి చివరి వరకు జీవించి ఉంటే 20 సంవత్సరం నుండి 24 సంవత్సరం వరకు 5 సంవత్సరాల పాటు మని బ్యాక్ మీరు తీసుకున్న ఆప్షన్ ఆధారంగా ఇబ్వ్వ్డం జరుగుతుంది.
మీరు మనీ బ్యాక్ లేకుండా వున్నదా ఆప్షన్ ఎంచుకుంటే మీకు మేచ్యురిటి కింద మీరు తీసుకున్న పాలసీ 10,00,000 పాటు బోనస్ 5,25,000 మరియు ఫైనల్ బోనస్ 20,000 వస్తే మీకు సుమారుగా 15,45,000 రావడం జరుగుతుంది.
పాలసీ తీసుకున్న తరువాత వద్దు అనుకుంటే ?
పాలసీ తీసుకున్న తరువాత మీకు పాలసీ యొక్క నియమ నిబందనలు నచ్చక పోతే, పాలసీ తీసుకున్న 15 రోజుల లోపు పాలసీని రద్దు చేసుకోవచ్చు.అప్పడు మీకు మీరు చెల్లించిన ప్రీమియంలో ఖర్చులు పోను మిగిలిన అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది.
ఈ పాలసీలో లోన్ సదుపాయం వుందా?
పాలసీ యొక్క ప్రీమియం 3 సంవత్సరాలు చెల్లించిన తరువాత మీరు లోన్ పొందటానికి అర్హులు.మీకు సరెండర్ వాల్యు లో 90 శాతం లోన్ గా లభిస్తుంది . వడ్డీ ప్రతి ఆరు నెలలకు చెల్లించాలి .వడ్డీ రేటు 9 నుండి11 శాతం మద్యలో ఉంటుంది.
పాలసీని మధ్యలో రద్దు చేస్తే
పాలసీ యొక్క ప్రీమియం 3 సంవత్సరాలు చెల్లించిన తరువాత పాలసీని సరెండర్ చేసుకోవచ్చు కాకపోతే అలా చేయడం వలన మీరు ఇన్సురెన్సే రక్షణను కోల్పోతారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి .అది కాక మీరు చెల్లించిన మొత్తం కూడా మీకు రాకపోవచ్చు.
పాలసీ ప్రీమియం సకాలంలో కట్టక పోతే ఏమి జరుగుతుంది
పాలసీ ప్రీమియం చెల్లించడానికి మీకు 30 రోజుల దయకాలం ఉంటుంది.ఒక వేళ అప్పుడు కూడా కట్టక పోతే పాలసీ రద్దు అవుతుంది .ఆగిన పాలసీ డేట్ నుండి 5 సంవత్సరాల లోపు ఎప్పుడయినా పాలసీని పునరుద్దరించుకోవచ్చు.
ఆదాయపు పన్ను ప్రయోజనం
ఈ పాలసీలో మీరు చెల్లించిన ప్రీమియం ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 80 సి కింద మీరు గరిష్టంగా 1,50,000 వరకు మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు . అలాగే మీరు తీసుకునే మేచ్యురిటి అమౌంట్ మీద ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 10 (10) డి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
0 Comments