Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

lic jeevan lakshya 933 policy detail in telugu ఎల్ఐసి వారి జీవన్ లక్ష్య పాలసీ 933

  హాయ్ ఫ్రెండ్స్ ఇన్సురెన్స్ పాలసీల సమాచార, బ్లాగ్ కి మీకు స్వాగతం.ఈ రోజు మనం ఎల్ఐసి వారి జీవన్ లక్ష్య  పాలసీ గురించి తెలుసుకుందాం. 



అసలు ఏంటి ఈపాలసీ ?

ఈ పాలసీ పేరు జీవన్ లక్ష్య, ఈ పాలసీ మీకు  పొదుపు మరియు రిస్క్ కవర్ అందించే పాలసిగా ఉంది అని చెప్పవచ్చు. మీ పిల్లలు మరియు మనవరాళ్ల ఆర్థిక రక్షణ కోసం, ఎల్ఐసి జీవన్ లక్ష్య సరైన పాలసీ. ఇది పొదుపుతో పాటు ప్రమాద రక్షణను అందిస్తుంది.ఇది పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీ ఇది ఎల్ఐసి యొక్క ఉత్తమ పాలసీల్లో ఒకటిగా ఉంది అని చెప్పవచ్చు. 

పాలసీ తీసుకోవడానికి అర్హతలు 

18 సంవత్సరాల నుండి 50 లోపు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు,కనీస పాలసీ 1,00,000 నుండి గరిష్టంగా ఎంత పాలసీ అయిన  ఇస్తారు.కాలపరిమితి13 నుండి 25 సంవత్సరల మద్య పెట్టుకోవచ్చు.అయితే ప్రీమియం మాత్రం పాలసీ టర్మ్ చివరి మూడు సంవత్సరాలు కట్టవలసిన అవసరం లేదు . ప్రీమియం కట్టడానికి సంవత్సరానికి,ఆరు నెలలు ,ముడు నెలలు,నెలవారీ చొప్పున కట్టవచ్చు.

పాలసీ తీసుకున్న వ్యక్తీ చనిపోతే 

పాలసీ కాలపరిమితిలో పాలసీ అమలులో ఉండి పాలసిదారుడు చనిపోతే,నామినిగా ఎవరయితే ఉన్నారో వాళ్ళకి పాలసీ కాల పరిమితి చివరివరకు, తీసుకున్న పాలసీలో 10 శాతం చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తూ ,మరల చివరన మేచ్యురిటి అమౌంట్ రావడం ఈ పాలసీ ప్రత్యేకత .

పాలసీ తీసుకున్న వ్యక్తీ బ్రతికి ఉంటే  

పాలసీ కాల పరిమితి చివరి వరకు పాలసీదారుడు జీవించి ఉంటే అతనికి మేచ్యురిటి అమౌంట్ ని చెల్లించడం జరుగుతుంది.ఈ పాలసీలో మీకు సమ్ అస్సుర్డ్ తో పాటు సింపుల్ రివర్శనారి బోనస్ మరియు ఫైనల్ అడిషనల్ బోనస్ కూడా రావడం జరుగుతుంది.

ఉదాహరణ  

మోహన్ అనే ఒక వ్యక్తీ వయస్సు 30 సంవత్సరాలు,అతను 25 సంవత్సరల కాలపరిమితితో ఒక 5లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే,ఏడాదికి ప్రీమియం 20,880 తో పాటు GST కలిపి ప్రీమియంగా చెల్లించాలి.

ఒక వేళ మోహన్ గారు కాల పరిమితి చివరి వరకు జీవించి ఉంటే అతను తీసుకున్న పాలసీ 5లక్షల  రూపాయలతో పాటు బోనస్ సుమారుగా 5,75,000 వస్తే మరియు ఫైనల్ అడిషనల్ బోనస్ 2,25,000 వస్తే మొత్తం మేచ్యురిటి 13,00,000 రావడానికి అవకాశం ఉంటుంది.

ఒక వేళ మధ్యలో ఎప్పుడు మరణించిన   వెంటనే నామినికి తీసుకున్న పాలసీలో 10 శాతం అంటే 50,000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం అలా పాలసీ టర్మ్ చివరి వరకు ఇవ్వడం జరుగుతుంది. మరల మేచ్యురిటి కింద 110 శాతం SA పాటు బోనస్ మరియు ఫైనల్ అడిషనల్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది.



పాలసీ తీసుకున్న తరువాత వద్దు అనుకుంటే ?  

పాలసీ తీసుకున్న తరువాత మీకు పాలసీ యొక్క నియమ నిబందనలు నచ్చక పోతే, పాలసీ తీసుకున్న 15 రోజుల లోపు పాలసీని రద్దు చేసుకోవచ్చు.అప్పడు మీకు మీరు చెల్లించిన ప్రీమియంలో ఖర్చులు పోను మిగిలిన అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది.

ఈ పాలసీలో లోన్ సదుపాయం వుందా?

పాలసీ యొక్క ప్రీమియం 3 సంవత్సరాలు చెల్లించిన తరువాత మీరు లోన్ పొందటానికి అర్హులు.మీకు సరెండర్ వాల్యు లో 90 శాతం లోన్ గా లభిస్తుంది . వడ్డీ ప్రతి ఆరు నెలలకు చెల్లించాలి .వడ్డీ రేటు 9 నుండి11 శాతం మద్యలో ఉంటుంది. 

పాలసీని మధ్యలో రద్దు చేస్తే 

 పాలసీ యొక్క ప్రీమియం 3 సంవత్సరాలు చెల్లించిన తరువాత పాలసీని  సరెండర్ చేసుకోవచ్చు కాకపోతే అలా చేయడం వలన మీరు ఇన్సురెన్సే రక్షణను కోల్పోతారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి .అది కాక మీరు చెల్లించిన మొత్తం కూడా మీకు రాకపోవచ్చు.

పాలసీ ప్రీమియం సకాలంలో కట్టక పోతే ఏమి జరుగుతుంది  

పాలసీ ప్రీమియం చెల్లించడానికి మీకు 30 రోజుల దయకాలం ఉంటుంది.ఒక వేళ అప్పుడు కూడా కట్టక పోతే పాలసీ రద్దు అవుతుంది .ఆగిన పాలసీ డేట్ నుండి 5 సంవత్సరాల లోపు ఎప్పుడయినా పాలసీని  పునరుద్దరించు కోవచ్చు 

ఆదాయపు పన్ను ప్రయోజనం 

ఈ పాలసీలో మీరు చెల్లించిన ప్రీమియం ఇన్కమ్ టాక్స్ యాక్ట్  సెక్షన్ 80 సి కింద మీరు గరిష్టంగా 1,50,000 వరకు మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు . అలాగే మీరు తీసుకునే మేచ్యురిటి అమౌంట్ మీద ఇన్కమ్ టాక్స్ యాక్ట్  సెక్షన్ 10 (10) డి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

Post a Comment

0 Comments