Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

lic pmvvy 856 policy detail in telugu ఎల్ఐసి వారి ప్రధానమంత్రి వయా వందన యోజన పాలసీ 856

   హాయ్ ఫ్రెండ్స్ ఇన్సురెన్స్ పాలసీల సమాచార, బ్లాగ్ కి మీకు స్వాగతం.ఈ రోజు మనం ఎల్ఐసి వారి ప్రధానమంత్రి వయా వందన యోజన  పాలసీ గురించి తెలుసుకుందాం.



అసలు ఏంటి ఈపాలసీ ?

ఈ పాలసీ పేరు ప్రధానమంత్రి వయా వందన యోజన,60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఈ పాలసీ ఇస్తారు .ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు10 సంవత్సరాల వరకు7.66% హామీ రాబడి లభిస్తుంది.ఈ పాలసీలోgst కట్టవలసిన అవసరం లేదు.

 పాలసీ తీసుకోవడానికి అర్హతలు 

60 సంవత్సరాలు పైన ఉన్నవారు ఈపాలసీ తీసుకోవచ్చు,కనీస పాలసీ 1,50,00 నుండి గరిష్టంగా 15,00,000 లక్షలు వరకు ఇస్తారు. పాలసీ కాల వ్యవది 10 సంవత్సరాలు.

పాలసీ తీసుకున్న వ్యక్తీ చనిపోతే 

పాలసీ కాలపరిమితిలో పాలసీ అమలులో ఉండి పాలసిదారుడు చనిపోతే,నామినిగా ఎవరయితే ఉన్నారో వాళ్ళకి పాలసీ అమౌంట్ ఇస్తారు.అది ఎలా ఇస్తారు అంటే మీరు ఎంత సింగల్ ప్రీమియం వేసారో అది.

ఉదాహరణ  

మోహన్ రావు అనే ఒక వ్యక్తీ వయస్సు 60 సంవత్సరాలు,అతను  ఒక 15 లక్షల రూపాయలు సింగల్ ప్రీమియం గా చెల్లిస్తే , నెలకు పెన్షన్ రూపంలో 9250 ప్రతి నెల అతనికి పెన్షన్ కింద10 సంవత్సరాలు పాటు ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో ఎప్పుడు మరణించిన నామినికి సింగల్ ప్రీమియం అమౌంట్ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది .

పాలసీ తీసుకున్న తరువాత వద్దు అనుకుంటే ?  

పాలసీ తీసుకున్న తరువాత మీకు పాలసీ యొక్క నియమ నిబందనలు నచ్చక పోతే, పాలసీ తీసుకున్న 15 రోజుల లోపు పాలసీని రద్దు చేసుకోవచ్చు.అప్పడు మీకు మీరు చెల్లించిన ప్రీమియంలో ఖర్చులు పోను మిగిలిన అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది.

ఈ పాలసీలో లోన్ సదుపాయం వుందా?

పాలసీ 3 సంవత్సరాల తరువాత మీరు లోన్ పొందటానికి అర్హులు.మీకు సరెండర్ వాల్యు లో 90 శాతం లోన్ గా లభిస్తుంది . వడ్డీ ప్రతి ఆరు నెలలకు చెల్లించాలి .వడ్డీ రేటు 9 నుండి11 శాతం మద్యలో ఉంటుంది. 

ఆదాయపు పన్ను ప్రయోజనం 

ఈ పాలసీలో మీరు చెల్లించిన ప్రీమియం ఇన్కమ్ టాక్స్ యాక్ట్  సెక్షన్ 80 సి కింద మీరు గరిష్టంగా 1,50,000 వరకు మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు . అలాగే మీరు తీసుకునే మేచ్యురిటి అమౌంట్ మీద ఇన్కమ్ టాక్స్ యాక్ట్  సెక్షన్ 10 (10) డి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.



Post a Comment

0 Comments