హాయ్ ఫ్రెండ్స్ ఇన్సురెన్స్ పాలసీల సమాచార, బ్లాగ్ కి మీకు స్వాగతం.ఈ రోజు మనం ఎల్ఐసి వారి జీవన్ శాంతి పాలసీ గురించి తెలుసుకుందాం.
అసలు ఏంటి ఈపాలసీ ?
ఈ పాలసీ పేరు జీవన్ శాంతి, ఎల్ఐసి యొక్క ముఖ్యమైన పథకాల్లో ఒకటి- ఎల్ఐసి యొక్క న్యూ జీవన్ శాంతి, ఇది నాన్-లింక్డ్, సింగిల్ ప్రీమియం మరియు డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్, ఇది పాలసీదారునికి సింగిల్ లైఫ్ మరియు జాయింట్ లైఫ్ యాన్యుటీ మధ్య ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. పాలసీ ప్రారంభంలో పాలసీదారులకు యాన్యుటీ రేట్లు హామీ ఇవ్వబడతాయి.
పాలసీ తీసుకోవడానికి అర్హతలు
30 సంవత్సరాల నుండి 79 లోపు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు,కనీస పాలసీ 1,50,000 నుండి గరిష్టంగా ఎంత పాలసీ అయిన ఇస్తారు. కనిష్ట డిఫమెంట్ వ్యవధి 1 సంవత్సరం గరిష్ట డిఫమెంట్ వ్యవధి12 సంవత్సరాలు కనిష్ట యన్యుటి నెలవారీ- రూ. 1000, త్రైమాసికంగా- రూ. 3000 ,అర్థ- వార్షికంగా- రూ. 6000 ,వార్షికంగా- రూ. 12000
పాలసీ తీసుకున్న వ్యక్తీ చనిపోతే
పాలసీ కాలపరిమితిలో పాలసీ అమలులో ఉండి పాలసిదారుడు చనిపోతే,నామినిగా ఎవరయితే ఉన్నారో వాళ్ళకి పాలసీ అమౌంట్ ఇస్తారు.అది ఎలా ఇస్తారు అంటే మీరు ఎంత సింగల్ ప్రీమియం వేసారో అంత
ఉదాహరణ
మోహన్ రావు అనే ఒక వ్యక్తీ వయస్సు60 సంవత్సరాలు,అతను1 సంవత్సరం డిఫమెంట్ వ్యవధితో ఒక 10 లక్షల రూపాయలు సింగల్ ప్రీమియం గా చెల్లిస్తే , ఏడాదికి పెన్షన్ రూపంలో 54,900 ప్రతి సంవత్సరం అతనికి పెన్షన్ కింద అతను జీవించి ఉన్నంత కాలం ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో ఎప్పుడు మరణించిన నామినికి సింగల్ ప్రీమియం అమౌంట్ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది .
పాలసీ తీసుకున్న తరువాత వద్దు అనుకుంటే ?
పాలసీ తీసుకున్న తరువాత మీకు పాలసీ యొక్క నియమ నిబందనలు నచ్చక పోతే, పాలసీ తీసుకున్న 15 రోజుల లోపు పాలసీని రద్దు చేసుకోవచ్చు.అప్పడు మీకు మీరు చెల్లించిన ప్రీమియంలో ఖర్చులు పోను మిగిలిన అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది.
ఈ పాలసీలో లోన్ సదుపాయం వుందా?
పాలసీ 3 నెలలు తరువాత మీరు లోన్ పొందటానికి అర్హులు.మీకు సరెండర్ వాల్యు లో 90 శాతం లోన్ గా లభిస్తుంది . వడ్డీ ప్రతి ఆరు నెలలకు చెల్లించాలి .వడ్డీ రేటు 9 నుండి11 శాతం మద్యలో ఉంటుంది.
ఆదాయపు పన్ను ప్రయోజనం
ఈ పాలసీలో మీరు చెల్లించిన ప్రీమియం ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 80 సి కింద మీరు గరిష్టంగా 1,50,000 వరకు మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు . అలాగే మీరు తీసుకునే మేచ్యురిటి అమౌంట్ మీద ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 10 (10) డి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
0 Comments