Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

lic jeevan shiromani 947 policy detail in telugu ఎల్ఐసి వారి జీవన్ శిరోమణి పాలసీ 947

  హాయ్ ఫ్రెండ్స్ ఇన్సురెన్స్ పాలసీల సమాచార, బ్లాగ్ కి మీకు స్వాగతం.ఈ రోజు మనం ఎల్ఐసి వారి జీవన్ శిరోమణి పాలసీ గురించి తెలుసుకుందాం. 



అసలు ఏంటి ఈపాలసీ ?

ఈ పాలసీ పేరు జీవన్ శిరోమణి, ఈపాలసీ మీకు పొదుపు మరియు రిస్క్ కవర్ అందించే పాలసిగా ఉంది అని చెప్పవచ్చు. ఎల్ఐసి జీవన్ శిరోమణి పాలసీ ఎల్ఐసి  యొక్క ఉత్తమ పాలసీల్లో ఒకటిగా ఉంది అని చెప్పవచ్చు.పాలసీదారుడు తీవ్రమైన అనారోగ్యానికి గురైతే ఈ పథకం పెద్ద మొత్తంలో సొమ్మును అందిస్తుంది. ఇది ప్రాథమిక పాలసీ మొత్తంలో10 శాతానికి సమానంగా ఉంటుంది.

పాలసీ తీసుకోవడానికి అర్హతలు 

18 సంవత్సరాల నుండి 55 లోపు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు,కనీస పాలసీ 1,00,00,000 నుండి గరిష్టంగా ఎంత పాలసీ అయిన ఇస్తారు.కాలపరిమితి14 లేదా16 లేదా18 లేదా20 సంవత్సరల మద్య పెట్టుకోవచ్చు.అయితే ప్రీమియం మాత్రం పాలసీ టర్మ్ చివరి 4 సంవత్సరాల పాటు ప్రీమియం కట్టవలసిన అవసరం లేదు. ప్రీమియం కట్టడానికి సంవత్సరానికి,ఆరు నెలలు ,ముడు నెలలు,నెలవారీ చొప్పున కట్టవచ్చు.

పాలసీ తీసుకున్న వ్యక్తీ చనిపోతే 

పాలసీ కాలపరిమితిలో పాలసీ అమలులో ఉండి పాలసిదారుడు చనిపోతే,నామినిగా ఎవరయితే ఉన్నారో వాళ్ళకి పాలసీ అమౌంట్ ఇస్తారు. ఇక్కడ సమ్ అస్సుర్డ్  డెత్ మరియు లయల్టి ఆడిషన్  ఇస్తారు.

ఇక్కడ సమ్ అస్సుర్డ్  డెత్  అంటే మీరు ఎంత పాలసీ తీసుకున్నారో దానికి 125 శాతం గాని లేకపోతే మీ సంవత్సరం ప్రీమియంకి 10 రెట్లు గాని లేకపోతే చెల్లించిన ప్రీమియం 105 శాతం గాని ఈ మూడింటిలో ఏది  ఎక్కువ అయితే అది నామినికి ఇవ్వడం జరుగుతుంది.  

పాలసీ తీసుకున్న వ్యక్తీ బ్రతికి ఉంటే  

పాలసీ కాల పరిమితి చివరి వరకు పాలసీదారుడు జీవించి ఉంటే అతనికి మేచ్యురిటి అమౌంట్ ని చెల్లించడం జరుగుతుంది. మధ్యలో మీకు ప్రీమియం చెల్లించడం పూర్తి  అయిన తరువాత 2 సార్లు మీరు తీసుకున్న టర్మ్ ఆదారంగా మనీ బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ పాలసీలో మీకు సమ్ అస్సుర్డ్ తో పాటు లయల్టి ఆడిషన్ రావడం జరుగుతుంది.

ఉదాహరణ  

కిరణ్  అనే ఒక వ్యక్తీ వయస్సు30 సంవత్సరాలు,అతను 20 సంవత్సరల కాలపరిమితితో ఒక 1CR రూపాయల పాలసీ తీసుకుంటే, ఏడాదికి ప్రీమియం 7,04,850 తో పాటు GST కలిపి ప్రీమియంగా చెల్లించాలి.

 ఒక వేళ కిరణ్ గారు కాల పరిమితి చివరి వరకు జీవించి ఉంటే 16 సంవత్సరం 45,00,000 మరియు 18 సంవత్సరం 45,00,000 మనీ బ్యాక్ కింద రావడం జరుగుతుంది.గ్యారంటి మేచ్యురిటి కింద 95,50,000 ఇస్తూ 39,00,000 లయల్టి వస్తే 13450000 మొత్తం రావడం జరుగుతుంది .

 మనీ బ్యాక్ కూడా కలుపుకుంటే మొత్తంగా 2,24,50,000 రావడం జరుగుతుంది. ఒక వేళ మధ్యలో ఎప్పుడు మరణించిన 1CR రూపాయలతో పాటు అప్పటివరకు జమ అయిన బోనస్ కలిపి నామినికి చెల్లిస్తారు .

పాలసీ కాలపరిమితిలో అనారోగ్యం కింది వాటిలో వస్తే 

1. పేర్కొన్న తీవ్రత యొక్క క్యాన్సర్

2. ఛాతీ CABG తెరవండి

3. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్

4. కిడ్నీ వైఫల్యం రెగ్యులర్ డయాలసిస్ అవసరం

5. ప్రధాన అవయవం / ఎముక మజ్జ మార్పిడి (గ్రహీతగా)

6. స్ట్రోక్ ఫలితంగా శాశ్వత లక్షణాలు కనిపిస్తాయి

7. అవయవాల శాశ్వత పక్షవాతం

8. నిరంతర లక్షణాలతో బహుళ స్క్లెరోసిస్

9. బృహద్ధమని శస్త్రచికిత్స

10. ప్రాథమిక (ఇడియోపతిక్) పల్మనరీ రక్తపోటు

11. అల్జీమర్స్ వ్యాధి / చిత్తవైకల్యం

12. అంధత్వం

13. మూడవ డిగ్రీ కాలిన గాయాలు

14. గుండె కవాటాల గుండె పున ment స్థాపన లేదా మరమ్మత్తు

15. నిరపాయమైన మెదడు కణితి

తీసుకున్న పాలసీలో 10 శాతం ఇస్తారు .



పాలసీ తీసుకున్న తరువాత వద్దు అనుకుంటే ?  

పాలసీ తీసుకున్న తరువాత మీకు పాలసీ యొక్క నియమ నిబందనలు నచ్చక పోతే, పాలసీ తీసుకున్న 15 రోజుల లోపు పాలసీని రద్దు చేసుకోవచ్చు.అప్పడు మీకు మీరు చెల్లించిన ప్రీమియంలో ఖర్చులు పోను మిగిలిన అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది.

ఈ పాలసీలో లోన్ సదుపాయం వుందా?

పాలసీ యొక్క ప్రీమియం 3 సంవత్సరాలు చెల్లించిన తరువాత మీరు లోన్ పొందటానికి అర్హులు.మీకు సరెండర్ వాల్యు లో 90 శాతం లోన్ గా లభిస్తుంది . వడ్డీ ప్రతి ఆరు నెలలకు చెల్లించాలి .వడ్డీ రేటు 9 నుండి11 శాతం మద్యలో ఉంటుంది. 

పాలసీని మధ్యలో రద్దు చేస్తే 

 పాలసీ యొక్క ప్రీమియం 3 సంవత్సరాలు చెల్లించిన తరువాత పాలసీని  సరెండర్ చేసుకోవచ్చు కాకపోతే అలా చేయడం వలన మీరు ఇన్సురెన్సే రక్షణను కోల్పోతారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి .అది కాక మీరు చెల్లించిన మొత్తం కూడా మీకు రాకపోవచ్చు.

పాలసీ ప్రీమియం సకాలంలో కట్టక పోతే ఏమి జరుగుతుంది  

పాలసీ ప్రీమియం చెల్లించడానికి మీకు 30 రోజుల దయకాలం ఉంటుంది.ఒక వేళ అప్పుడు కూడా కట్టక పోతే పాలసీ రద్దు అవుతుంది .ఆగిన పాలసీ డేట్ నుండి 5 సంవత్సరాల లోపు ఎప్పుడయినా పాలసీని  పునరుద్దరించు కోవచ్చు 

ఆదాయపు పన్ను ప్రయోజనం 

ఈ పాలసీలో మీరు చెల్లించిన ప్రీమియం ఇన్కమ్ టాక్స్ యాక్ట్  సెక్షన్ 80 సి కింద మీరు గరిష్టంగా 1,50,000 వరకు మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు . అలాగే మీరు తీసుకునే మేచ్యురిటి అమౌంట్ మీద ఇన్కమ్ టాక్స్ యాక్ట్  సెక్షన్ 10 (10) డి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

Post a Comment

0 Comments