Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

lic jeevan amar 855 policy detail in telugu ఎల్ఐసి వారి జీవన్ అమర్ పాలసీ 855

   హాయ్ ఫ్రెండ్స్ ఇన్సురెన్స్ పాలసీల సమాచార, బ్లాగ్ కి మీకు స్వాగతం.ఈ రోజు మనం ఎల్ఐసి వారి జీవన్ అమర్ పాలసీ గురించి తెలుసుకుందాం. 



అసలు ఏంటి ఈపాలసీ ?

ఈ పాలసీ పేరు జీవన్ అమర్, ఈ పాలసీ పూర్తిగా టర్మ్ పాలసీ కావున పాలసీ కట్టిన వ్యక్తీ పాలసీ కాలపరిమితి లో మరణించినప్పుడు మాత్రమే ఈ పాలసీ యొక్క ప్రయోజనాలు నామినికి అందించబడతాయి.జీవించి ఉంటే ఎటువంటి ప్రయోజనం మీకు రాదు. 

పాలసీ తీసుకోవడానికి అర్హతలు 

18 సంవత్సరాల నుండి 65 లోపు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు,కనీస పాలసీ 25 లక్షల నుండి గరిష్టంగా ఎంత పాలసీ అయిన  ఇస్తారు.కాలపరిమితి 10 నుండి 40  మద్య పెట్టుకోవచ్చు.  ప్రీమియం కట్టడానికి సింగల్ ప్రీమియం మరియు  సంవత్సరానికి,ఆరు నెలలు ,ముడు నెలలు,నెలవారీ చొప్పున కట్టవచ్చు.

పాలసీ తీసుకున్న వ్యక్తీ చనిపోతే 

పాలసీ కాలపరిమితిలో పాలసీ అమలులో ఉండి పాలసిదారుడు చనిపోతే,నామినిగా ఎవరయితే ఉన్నారో వాళ్ళకి పాలసీ అమౌంట్ ఇస్తారు. 

పాలసీ తీసుకున్న వ్యక్తీ బ్రతికి ఉంటే  

పాలసీ కాల పరిమితి చివరి వరకు పాలసీదారుడు జీవించి ఉంటే అతనికి  ఎటువంటి మేచ్యురిటి అమౌంట్ చెల్లించడం జరగదు ఎందుకంటె ఇది టర్మ్ పాలసీ కాబట్టి.

ఉదాహరణ  

కిరణ్  అనే ఒక వ్యక్తీ వయస్సు 30 సంవత్సరాలు,అతను 20 సంవత్సరల కాలపరిమితితో ఒక 1CR రూపాయల పాలసీ తీసుకుంటే, ఏడాదికి ప్రీమియం 14,400 తో పాటు GST కలిపి ప్రీమియం గా చెల్లించాలి.

ఒక వేళ కిరణ్  గారు కాల పరిమితి చివరి వరకు జీవించి ఉంటే ఎటువంటి మేచ్యురిటి అమౌంట్ చెల్లించడం జరగదు. ఒక వేళ మధ్యలో ఎప్పుడు మరణించిన 1CR రూపాయలు నామినికి చెల్లిస్తారు  .

పాలసీ తీసుకున్న తరువాత వద్దు అనుకుంటే ?  

పాలసీ తీసుకున్న తరువాత మీకు పాలసీ యొక్క నియమ నిబందనలు నచ్చక పోతే, పాలసీ తీసుకున్న 15 రోజుల లోపు పాలసీని రద్దు చేసుకోవచ్చు.అప్పడు మీకు మీరు చెల్లించిన ప్రీమియంలో ఖర్చులు పోను మిగిలిన అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది.



ఈ పాలసీలో లోన్ సదుపాయం వుందా?

ఇది టర్మ్ పాలసీ కావడం వలన ఈ పాలసీలో లోన్ సదుపాయం లేదు 

పాలసీ ప్రీమియం సకాలంలో కట్టక పోతే ఏమి జరుగుతుంది  

పాలసీ ప్రీమియం చెల్లించడానికి మీకు 30 రోజుల దయకాలం ఉంటుంది.ఒక వేళ అప్పుడు కూడా కట్టక పోతే పాలసీ రద్దు అవుతుంది .ఆగిన పాలసీ డేట్ నుండి 5 సంవత్సరాల లోపు ఎప్పుడయినా పాలసీని  పునరుద్దరించు కోవచ్చు 

ఆదాయపు పన్ను ప్రయోజనం 

ఈ పాలసీలో మీరు చెల్లించిన ప్రీమియం ఇన్కమ్ టాక్స్ యాక్ట్  సెక్షన్ 80 సి కింద మీరు గరిష్టంగా 1,50,000 వరకు మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు . అలాగే మీరు తీసుకునే డెత్అ మౌంట్ మీద ఇన్కమ్ టాక్స్ యాక్ట్  సెక్షన్ 10 (10) డి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.



Post a Comment

0 Comments