హాయ్ ఫ్రెండ్స్ ఇన్సురెన్స్ పాలసీల సమాచార, బ్లాగ్ కి మీకు స్వాగతం.ఈ రోజు మనం ఎల్ఐసి వారి జీవన్ ఉమంగ్ పాలసీ గురించి తెలుసుకుందాం.
అసలు ఏంటి ఈపాలసీ ?
ఈ పాలసీ పేరు జీవన్ ఉమంగ్, ఈ పాలసీ మీకు పొదుపు మరియు రిస్క్ కవర్ అందించే పాలసిగా ఉంది అని చెప్పవచ్చు. ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ ఎల్ఐసి యొక్క ఉత్తమ పాలసీల్లో ఒకటిగా ఉంది అని చెప్పవచ్చు. ఈ పాలసీ పెన్షన్ కావాలి అని అనుకునే వారికీ ఒక మంచి పాలసీ అని చెప్పవచ్చు .
పాలసీ తీసుకోవడానికి అర్హతలు
90 రోజుల నుండి 55 లోపు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు,కనీస పాలసీ 2,00,000 నుండి గరిష్టంగా ఎంత పాలసీ అయిన ఇస్తారు.కాలపరిమితి 15 లేదా 20 లేదా25 లేదా30 సంవత్సరల మద్య పెట్టుకోవచ్చు.ప్రీమియం కట్టడానికి సంవత్సరానికి,ఆరు నెలలు ,ముడు నెలలు,నెలవారీ చొప్పున కట్టవచ్చు.
పాలసీ తీసుకున్న వ్యక్తీ చనిపోతే
పాలసీ కాలపరిమితిలో పాలసీ అమలులో ఉండి పాలసిదారుడు చనిపోతే,నామినిగా ఎవరయితే ఉన్నారో వాళ్ళకి పాలసీ అమౌంట్ ఇస్తారు.అది ఎలా ఇస్తారు అంటే మీరు ఎంత పాలసీ తీసుకున్నారో అది గాని లేకపోతే మీ సంవత్సరం ప్రీమియంకి 10 రెట్లు గాని లేకపోతే చెల్లించిన ప్రీమియం 105 శాతం గాని ఈ మూడింటిలో ఏది ఎక్కువ అయితే అది నామినికి ఇవ్వడం జరుగుతుంది.
సర్వైవల్ బెనిఫిట్
ఈ పాలసీలో పాలసీదారుడు పాలసీ చివరి ప్రీమియం కట్టిన తరువాత అతనికి 100 సంవత్సరాల వయసు వచ్చే వరకు తీసుకున్న పాలసీలో 8% సర్వైవల్ బెనిఫిట్ గా ఇక్కడ చెల్లించడం జరుగుతుంది.
పాలసీ తీసుకున్న వ్యక్తీ బ్రతికి ఉంటే
పాలసీ కాలపరిమితి చివరి వరకు పాలసీదారుడు జీవించి ఉంటే అతనికి మేచ్యురిటి అమౌంట్ ని చెల్లించడం జరుగుతుంది.ఈ పాలసీలో మీకు సమ్ అస్సుర్డ్ తో పాటు సింపుల్ రివర్శనారి బోనస్ మరియు ఫైనల్ అడిషనల్ బోనస్ కూడా రావడం జరుగుతుంది .
ఉదాహరణ
తిలక్ అనే ఒక వ్యక్తీ వయస్సు30 సంవత్సరాలు,అతను30 సంవత్సరల కాలపరిమితితో ఒక10లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే, ఏడాదికి ప్రీమియం 30,759 తో పాటు GST కలిపి ప్రీమియంగా చెల్లించాలి .ఒక వేళ తిలక్ గారు కాల పరిమితి చివరి వరకు జీవించి ఉంటే
అతను తీసుకున్న పాలసీ 10 లక్షల రూపాయలతో పాటు బోనస్ సుమారుగా 82,45,000 వస్తే మొత్తం మేచ్యురిటి 92,45,000 రావడానికి అవకాశం ఉంటుంది.ఒక వేళ మధ్యలో ఎప్పుడు మరణించిన 10 లక్షల రూపాయలతో పాటు అప్పటివరకు జమ అయిన బోనస్ మరియు ఫైనల్ అడిషనల్ బోనస్ ఏమయినా ఉంటే అది కలిపి నామినికి చెల్లిస్తారు .
పాలసీ తీసుకున్న తరువాత వద్దు అనుకుంటే ?
పాలసీ తీసుకున్న తరువాత మీకు పాలసీ యొక్క నియమ నిబందనలు నచ్చక పోతే, పాలసీ తీసుకున్న 15 రోజుల లోపు పాలసీని రద్దు చేసుకోవచ్చు.అప్పడు మీకు మీరు చెల్లించిన ప్రీమియంలో ఖర్చులు పోను మిగిలిన అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది.
ఈ పాలసీలో లోన్ సదుపాయం వుందా?
పాలసీ యొక్క ప్రీమియం 3 సంవత్సరాలు చెల్లించిన తరువాత మీరు లోన్ పొందటానికి అర్హులు.మీకు సరెండర్ వాల్యు లో 90 శాతం లోన్ గా లభిస్తుంది . వడ్డీ ప్రతి ఆరు నెలలకు చెల్లించాలి .వడ్డీ రేటు 9 నుండి11 శాతం మద్యలో ఉంటుంది.
పాలసీని మధ్యలో రద్దు చేస్తే
పాలసీ యొక్క ప్రీమియం 3 సంవత్సరాలు చెల్లించిన తరువాత పాలసీని సరెండర్ చేసుకోవచ్చు కాకపోతే అలా చేయడం వలన మీరు ఇన్సురెన్సే రక్షణను కోల్పోతారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి .అది కాక మీరు చెల్లించిన మొత్తం కూడా మీకు రాకపోవచ్చు.
పాలసీ ప్రీమియం సకాలంలో కట్టక పోతే ఏమి జరుగుతుంది
పాలసీ ప్రీమియం చెల్లించడానికి మీకు 30 రోజుల దయకాలం ఉంటుంది.ఒక వేళ అప్పుడు కూడా కట్టక పోతే పాలసీ రద్దు అవుతుంది .ఆగిన పాలసీ డేట్ నుండి 5 సంవత్సరాల లోపు ఎప్పుడయినా పాలసీని పునరుద్దరించు కోవచ్చు
ఆదాయపు పన్ను ప్రయోజనం
ఈ పాలసీలో మీరు చెల్లించిన ప్రీమియం ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 80 సి కింద మీరు గరిష్టంగా 1,50,000 వరకు మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు . అలాగే మీరు తీసుకునే మేచ్యురిటి అమౌంట్ మీద ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 10 (10) డి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
0 Comments