Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

lic beema bachat 945 deatil in telugu ఎల్ఐసి వారి భీమ బచత్ పాలసీ 945

  హాయ్ ఫ్రెండ్స్ ఇన్సురెన్స్ పాలసీల సమాచార, బ్లాగ్ కి మీకు స్వాగతం.ఈ రోజు మనం ఎల్ఐసి వారి భీమ బచత్ పాలసీ గురించి తెలుసుకుందాం. 



అసలు ఏంటి ఈపాలసీ ?

ఈ పాలసీ పేరు భీమ బచత్,ఈ పాలసీ మీకు  పొదుపు మరియు రిస్క్ కవర్ అందించే పాలసిగా ఉంది అని చెప్పవచ్చు.ఎల్ఐసి భీమ బచత్ పాలసీ ఎల్ఐసి యొక్క ఉత్తమ పాలసీల్లో ఒకటిగా ఉంది అని చెప్పవచ్చు.ఈ పాలసీ ఒక సింగల్ ప్రీమియం పాలసీ మరియు మనీ బ్యాక్ తో కూడిన పాలసీ అని చెప్పవచ్చు 

పాలసీ తీసుకోవడానికి అర్హతలు 

15 సంవత్సరాల నుండి 66 లోపు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు,కనీస పాలసీ 35,000 నుండి గరిష్టంగా ఎంత పాలసీ అయిన ఇస్తారు.కాలపరిమితి 9 లేదా12 లేదా15 సంవత్సరాలుగా ఉంది.

పాలసీ తీసుకున్న వ్యక్తీ చనిపోతే 

పాలసీ కాలపరిమితిలో పాలసీ అమలులో ఉండి పాలసిదారుడు చనిపోతే,నామినిగా ఎవరయితే ఉన్నారో వాళ్ళకి పాలసీ అమౌంట్ ఇస్తారు. ఇక్కడ సమ్ అస్సుర్డ్  డెత్ మరియు లయల్టి ఆడిషన్  నామినికి ఇవ్వడం జరుగుతుంది.  

పాలసీ తీసుకున్న వ్యక్తీ బ్రతికి ఉంటే  

పాలసీ కాల పరిమితి చివరి వరకు పాలసీదారుడు జీవించి ఉంటే అతనికి మేచ్యురిటి అమౌంట్ ని చెల్లించడం జరుగుతుంది.మధ్యలో మీకు తీసుకున్న టర్మ్ ఆదారంగా మనీ బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ పాలసీలో మీకు సమ్ అస్సుర్డ్ తో పాటు లయల్టి ఆడిషన్  రావడం జరుగుతుంది .

ఉదాహరణ  

భాస్కర్ అనే ఒక వ్యక్తీ వయస్సు 30 సంవత్సరాలు,అతను 15 సంవత్సరల కాలపరిమితితో ఒక 10 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే, సింగల్  ప్రీమియం 7,35,300 తో పాటు GST కలిపి ప్రీమియంగా చెల్లించాలి.

ఒక వేళ భాస్కర్  గారు కాల పరిమితి లో 3 సంవత్సరం1,50,000 మరియు 6 సంవత్సరం 1,50,000 మరియు12 సంవత్సరం 1,50,000 మని బ్యాక్ కింద ఇచ్చి 15 సంవత్సరం సుమారుగా 10,68,389 రావడం జరుగుతుంది. మొత్తం మని బ్యాక్ కూడా కలుపుకుంటే 16,68,389 రావడం జరుగుతుంది.ఒక వేళ మధ్యలో ఎప్పుడు మరణించిన 10 లక్షల రూపాయలతో పాటు అప్పటివరకు జమ అయిన లయల్టి ఆడిషన్ కలిపి నామినికి చెల్లిస్తారు.



పాలసీ తీసుకున్న తరువాత వద్దు అనుకుంటే ?  

పాలసీ తీసుకున్న తరువాత మీకు పాలసీ యొక్క నియమ నిబందనలు నచ్చక పోతే, పాలసీ తీసుకున్న 15 రోజుల లోపు పాలసీని రద్దు చేసుకోవచ్చు.అప్పడు మీకు మీరు చెల్లించిన ప్రీమియంలో ఖర్చులు పోను మిగిలిన అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది.

ఈ పాలసీలో లోన్ సదుపాయం వుందా?

పాలసీ యొక్క ప్రీమియం 3 సంవత్సరాలు చెల్లించిన తరువాత మీరు లోన్ పొందటానికి అర్హులు.మీకు సరెండర్ వాల్యు లో 90 శాతం లోన్ గా లభిస్తుంది . వడ్డీ ప్రతి ఆరు నెలలకు చెల్లించాలి .వడ్డీ రేటు 9 నుండి11 శాతం మద్యలో ఉంటుంది. 

పాలసీని మధ్యలో రద్దు చేస్తే 

 పాలసీ యొక్క ప్రీమియం 3 సంవత్సరాలు చెల్లించిన తరువాత పాలసీని  సరెండర్ చేసుకోవచ్చు కాకపోతే అలా చేయడం వలన మీరు ఇన్సురెన్సే రక్షణను కోల్పోతారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి .అది కాక మీరు చెల్లించిన మొత్తం కూడా మీకు రాకపోవచ్చు.

ఆదాయపు పన్ను ప్రయోజనం 

ఈ పాలసీలో మీరు చెల్లించిన ప్రీమియం ఇన్కమ్ టాక్స్ యాక్ట్  సెక్షన్ 80 సి కింద మీరు గరిష్టంగా 1,50,000 వరకు మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు . అలాగే మీరు తీసుకునే మేచ్యురిటి అమౌంట్ మీద ఇన్కమ్ టాక్స్ యాక్ట్  సెక్షన్ 10 (10) డి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.


Post a Comment

0 Comments