హాయ్ ఫ్రెండ్స్ ఇన్సురెన్స్ పాలసీల సమాచార, బ్లాగ్ కి మీకు స్వాగతం.ఈ రోజు మనం ఎల్ఐసి వారి నివేష్ ప్లస్ పాలసీ గురించి తెలుసుకుందాం.
అసలు ఏంటి ఈపాలసీ ?
ఈ పాలసీ పేరు నివేష్ ప్లస్ పాలసీ, ఈ పాలసీ మీకు పొదుపు మరియు రిస్క్ కవర్ అందించే పాలసిగా ఉంది అని చెప్పవచ్చు. ఎల్‌ఐసి నివేష్ ప్లస్ పాలసీ అనేది సింగిల్ ప్రీమియం యూనిట్ లింక్డ్ పాలసీ.
ఇది మీ డబ్బును పెంచుకునే అవకాశాన్ని అందిస్తుంది. మరియు లైఫ్ కవర్‌ను కూడా అందిస్తుంది.యూనిట్ లింక్డ్ ప్లాన్ కావడంతో, ఇది ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే ఎక్కువ వృద్ధి అందిస్తుంది. మీరు డబ్బును పెట్టుబడి పెట్టే ఫండ్ పనితీరు ఆధారంగా మీకు రాబడి రావడం జరుగుతుంది.
పాలసీ తీసుకోవడానికి అర్హతలు
90 రోజుల నుండి నుండి 70 లోపు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు,కనీస సింగిల్ ప్రీమియం 1,00,000.గరిష్ట పరిమితి లేదు ప్రీమియం కట్టడానికి ఒకటే ఆప్షన్ సింగల్.
ఈ పాలసీ ఎలా పనిచేస్తుంది
ఎల్ఐసి నివేష్ ప్లస్ సింగిల్ ప్రీమియం పాలసీ కాబట్టి మీరు మీకు నచ్చిన ఫండ్స్ లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు పాలసీ యొక్క కాలాన్ని 10 నుండి 25 సంవత్సరాల మధ్య మీకు నచ్చిన టర్మ్ ఎంచుకోవచ్చు.మీకు ఎంచుకోవడానికి 4 ఫండ్స్ ఇందులో ఉన్నాయి.
మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం మరియు తీసుకున్న ఫండ్ ఆధారంగా, మీకు ఈ యూనిట్లు కేటాయించబడతాయి. ఈ ఫండ్ విలువ రోజువారీగా ప్రకటించబడే NAV పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు మీ పెట్టుబడి మరియు పనితీరును మొదటి రోజు నుండి ట్రాక్ చేయవచ్చు.
గమనిక - ఈ పాలసీ లో, మీరు కనీసం 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. మీరు 5 సంవత్సరాల ముందు మీ పెట్టుబడిని ఉపసంహరించుకోలేరు.
మెచ్యూరిటీ బెనిఫిట్ - పాలసీ కాలం ముగింపులో మీరు పాలసీలో ఫండ్ విలువను పొందుతారు. ఒక ఉదాహరణగా, మీ వద్ద 1,000 యూనిట్లను మీరు కలిగి ఉంటే అప్పుడు NAV ఒక రూ. 53.26 ఉంటే మీకు ఫండ్ విలువ 1000 x 53.26 = రూ. 53,260.మీకు రావడం జరుగుతుంది.
యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ - మీరు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వార మీరు ఈ రైడర్‌ను మీ పాలసీకి జోడించవచ్చు. ప్రమాదం కారణంగా మరణం సంభవించినట్లయితే, మీ నామినీ పాలసీ మూల ప్రయోజనంతో పాటు రైడర్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు.
పాక్షిక ఉపసంహరణ - 5 పాలసీ సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు ఎప్పుడైనా మీ నిధులను పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. పాక్షిక ఉపసంహరణలు చేయడానికి మీరు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మీరు ఉపసంహరించుకునే మొత్తం ఈ క్రింది విధంగా నిర్ణయించబడుతుంది
సరెండర్ - మీరు 5 పాలసీ సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా మీ ప్లాన్‌ను అప్పగించవచ్చు మరియు ఫండ్ విలువను పొందవచ్చు. ఒకవేళ మీరు 5 సంవత్సరాల ముందు సరెండర్ చేస్తే , నిధులు నిలిపివేయబడిన ఫండ్‌కు వెళతాయి మరియు మీరు 5 సంవత్సరాల తరువాత ఉపసంహరించుకోవచ్చు - మీరు డిస్-కంటిన్యూషన్ ఛార్జీలను కూడా చెల్లించాలి.
పాలసీ తీసుకున్న వ్యక్తీ చనిపోతే
పాలసీ కాలపరిమితిలో పాలసీ అమలులో ఉండి పాలసిదారుడు చనిపోతే,నామినిగా ఎవరయితే ఉన్నారో వాళ్ళకి పాలసీ అమౌంట్ ఇస్తారు.అది ఎలా ఇస్తారు అంటే మీరు ఎంత పాలసీ తీసుకున్నారో అది గాని ఫండ్ వాల్యు గని ఏది ఎక్కువ ఐయితే అది .
పాలసీ తీసుకున్న వ్యక్తీ బ్రతికి ఉంటే
పాలసీ కాల పరిమితి చివరి వరకు పాలసీదారుడు జీవించి ఉంటే అతనికి మేచ్యురిటి అమౌంట్ ని చెల్లించడం జరుగుతుంది.ఈ పాలసీలో మీకు ఫండ్ వాల్యు ఇవ్వడం జరుగుతుంది .
పాలసీ తీసుకున్న తరువాత వద్దు అనుకుంటే ?
పాలసీ తీసుకున్న తరువాత మీకు పాలసీ యొక్క నియమ నిబందనలు నచ్చక పోతే, పాలసీ తీసుకున్న 15 రోజుల లోపు పాలసీని రద్దు చేసుకోవచ్చు.అప్పడు మీకు మీరు చెల్లించిన ప్రీమియంలో ఖర్చులు పోను మిగిలిన అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది.
పాలసీ ప్రీమియం సకాలంలో కట్టక పోతే ఏమి జరుగుతుంది
పాలసీ ప్రీమియం చెల్లించడానికి మీకు 30 రోజుల దయకాలం ఉంటుంది.ఒక వేళ అప్పుడు కూడా కట్టక పోతే పాలసీ రద్దు అవుతుంది .ఆగిన పాలసీ డేట్ నుండి 5 సంవత్సరాల లోపు ఎప్పుడయినా పాలసీని పునరుద్దరించు కోవచ్చు
ఆదాయపు పన్ను ప్రయోజనం
ఈ పాలసీలో మీరు చెల్లించిన ప్రీమియం ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 80 సి కింద మీరు గరిష్టంగా 1,50,000 వరకు మీరు పన్ను మినహాయింపు పొందవచ్చు . అలాగే మీరు తీసుకునే మేచ్యురిటి అమౌంట్ మీద ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 10 (10) డి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
0 Comments